తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర- మాజీ ఎంపీపీ వంగాల శ్రీనివాస రెడ్డి

Oplus_131072

ప్రజాపవర్ గడివేముల :తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర అని తెలుగు నేలపై అతి పెద్ద సైన్యం తెలుగుదేశం పార్టీకి సొంతమని మాజీ ఎంపీపీ వంగాల శ్రీనివాస రెడ్డి అన్నారు. మండల పరిధిలోని మంచాలకట్ట గ్రామంలో టిడిపి ఆవిర్భావ దినోత్సవాన్ని  శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుజాతి ఔన్నత్యానికి నందమూరి తారక రామారావు వెలుగును ప్రసాదించారన్నారు. దేశంలోనే తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకత ఉందన్నారు. ఎన్టీఆర్ వేసిన పునాది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానిని ప్రతిష్టం చేయడంతో తెలుగు నేలపై అతి పెద్ద సైన్యం తెలుగుదేశం పార్టీ స్వంతం  అయ్యిందన్నారు. ఈ కార్యక్రమంలో దేశం నారాయణరెడ్డి, వంగాల భాస్కర్ రెడ్డి  కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Share this