విగ్నేశ్వరుని తొలి పూజాకార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త జయసూర్య

నందికొట్కూరు : నందికొట్కూరు మండల పరిధిలోని అల్లూరు గ్రామంలో వినాయక చవితి శుభ సందర్భంగా సవరమ్మ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన విగ్నేశ్వరుని తొలి పూజా కార్యక్రమంలో పాల్గొని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ప్రజలందరికీ ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రజలు సుఖ సంతోషాలతో గడపాలని, అన్ని విజ్ఞాలు తొలగిపోయి, వర్షాలు బాగా పడి పాడిపంటలు సమృద్ధిగా పండి ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండాలని విగ్నేశ్వరుని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో అల్లూరు కమిటీ సభ్యులు యువకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this