అనుచరులకు అండగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి

నంద్యాల జిల్లా నందికొట్కూరు : అమ్మా మీరూ మా ఇంటికా.. అనగానే వెంటనే స్పందించిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మా కుటుంబానికి అండగా ఉంటున్న మీకు కష్టం వస్తే నేనున్నా అన్న భరోసా ఇచ్చేందుకే వచ్చా అని  ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి చెప్పడంతో బైరెడ్డి ముఖ్య అనుచరుడు చాకలి కృష్ణ కుటుంబం ఆచర్యానికి గురైంది. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పాత ముచ్చుమర్రి గ్రామంలో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరుడు చాకలి కృష్ణ ఇంటికి వెళ్లి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పలకరించి కుటుంబ సభ్యులకు మనో ధైర్యం చెప్పి అండగా ఉంటానని భరోసా ఇచ్చి,  ఆర్థిక సహాయం అందజేశారు. ఇంకా ఏమైన అవసరం ఉంటే తనను సంప్రదించాలని చాకలి కృష్ణ కుటుంబానికి ఎంపీ శబరి చెప్పారు.

Share this