ఆర్ జి ఎం అధ్యాపకునికి డాక్టరేట్ ప్రధానం

 నంద్యాల జిల్లా/పాణ్యం : ఆర్ జి ఎం ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన సి ఎస్ ఈ (డేటా సైన్స్) విభాగానికి చెందిన డాక్టర్ బి. భాస్కర్ రావు శుక్రవారం డాక్టరేట్ పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జయచంద్ర ప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ “ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్యూసైడల్ రిస్క్ ఆన్ సోషియల్ మీడియా యూసింగ్ మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్” అనే అంశంపై పరిశోధన చేసినందుకు గాను కర్ణాటకవిశ్వేశ్వరయ్య సాంకేతిక విశ్వవిద్యాలయం నుండి పీహెచ్.డి డిగ్రీ పొందారన్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ మిద్దె శాంతి రాముడు, ఎండి శివరాం కళాశాల అధ్యాపక బృందం ఆయనను అభినందించారు.

Share this