నంద్యాల : స్థానిక పట్టణంలోని బొమ్మల సత్రంలోని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కార్యాలయంలో శనివారం బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధుల చెక్కులు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పంపిణి చేశారు.ఈ సందర్బంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ పేద రోగులకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు, నిరుపేద రోగులకు అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అవసరమైన రోగులకు త్వరగా విడుదల చేస్తూ భరోసా కల్పిస్తున్నారని ఆమె వివరించారు. ఎంపీ గా తాను సీఎం రిలీఫ్ ఫండ్ కు సిఫారసు చేసిన వెంటనే బాధిత రోగులకు నిధులు విడుదల చేస్తూ వారి అకౌంట్ కే జమచేయడం జరుగుతుందని, అందులో భాగంగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం బాచుపల్లె గ్రామానికి చెందిన ముత్యాలపపాటి మహ్మద్ హుసేన్ కు రూ.81311 వేలు, నంద్యాల ఎస్ బి ఐ కాలనీకీ చెందిన అనకాలసుజాత కు రూ. 31278 వేలు, నంద్యాల జగజ్జనని నగర్ కు చెందిన చాకలి లక్ష్మీదేవికి రూ. 45000వేలు,నంద్యాల ముల్లాపేటకు చెందిన ముళ్ళ అస్మా కు రూ. 20000 వేలు, నంద్యాల మండలం అయ్యాలూరుకు చెందిన సయ్యద్ నజియా సుల్తానాకు రూ.35000వేల చెక్కులు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పంపిణి చేశారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణి చేసిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి

Leave a Reply