ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆఫీస్ లో ఘనంగా టీడీపీ ఆవిర్బావ వేడుకలు

Oplus_131072

ప్రజాపవర్ నంద్యాల   :  తెలుగు వారి ఆత్మగౌరవాన్ని, కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన దివంగత ముఖ్యమంత్రి,  తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు అని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కార్యాలయం ఇంచార్జి, మాజీ కౌన్సిలర్ నరహరి విశ్వనాధ్ రెడ్డి అన్నారు. శనివారం నంద్యాల బొమ్మలసత్రంలోని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కార్యాలయంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 43 వ ఆవీర్బావ వేడుకలు జరిగాయి.సందర్బంగా టీడీపీ నాయకులు నరహరి విశ్వనాధ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్ టీ ఆర్ టీడీపీని స్థాపించి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి పేదరికి నిర్ములనకు పాటుపడ్డాదని, బడుగు బలహీన వర్గాలను రాజకీయంగా ముందుకు తెచ్చారని, కుల, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఎన్ టీ ఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించారని, రాయలసీమ కరువును పరిష్కరించేందుకు తెలుగుగంగ, ఎస్ ఆర్ బి సి తదితర సాగునీటి ప్రాజెక్టులు అందించారని వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్ టీ ఆర్ చూపిన టీడీపీ ఆదర్శ బాటలో పయనిస్తూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని, డైనమిక్, డేరింగ్  మహిళగా నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి లు దివంగత ఎన్ టి ఆర్ చూపిన మార్గంలో నడుస్తూ నంద్యాల పార్లమెంట్ అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆఫీస్ ఆవరణలో టీడీపీ జెండా ఎగురవేసి, ఎన్ టి ఆర్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి, టీడీపీ ఆవీర్బావ వేడుకలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అజయ్, సూరి, శ్రీలక్ష్మి,  గణపం పుల్లారెడ్డి, నెరవాడ సర్పంచ్ శివారెడ్డి, పోలూరు నాగేశ్వరరెడ్డి, కోడూరు సంజీవరెడ్డి, పాణ్యం పుల్లారెడ్డి, గోరుకల్లు ఎరుకలయ్య, బి ఎస్ ఎన్ ఎల్ సలహా కమిటీ సభ్యులు పెరుమాళ్ళ విజయకుమార్, పెరుమాళ్ళ శ్రీనివాసులు, 32 వార్డు టీడీపీ ఇంచార్జి పోలిరెడ్డి, సుబ్బారెడ్డి, కొండా శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ భవనాసి పుల్లయ్య, మాజీ కౌన్సిలర్లు దస్తగిరి, మద్దిలేటి, సామన్న తదితరులు పాల్గొన్నారు.

Share this