ప్రజాపవర్ రాచర్ల : మండల పరిధిలోని జెపి చెరువు అటవీ ప్రాంతంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ నెమలి గుండ్ల రంగనాయక స్వామి దేవస్థానంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కార్యనిర్వాహక అధికారి మల్లవరపు నాగయ్య శుక్రవారం తెలిపారు. ఆలయంలో ప్రతి శనివారం ప్రత్యేక పూజలు జరుగుతాయని అందులో భాగంగా ఈ శనివారం కూడా పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.భక్తుల స్వామివారి దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు.దర్శనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆలయంలోని సత్రాలలో భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమం జరుగుతుందన్నారు.భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రంగస్వామి ఆలయంలో నేడు ప్రత్యేక పూజలు

Leave a Reply