మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారం యధాతధం

Oplus_131072

*  గాలి వార్తలు నమ్మొద్దు : మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి

నంద్యాల : స్థానిక మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఈ నెల 12వ తేదీ గురువారం ఉదయం 9గంటలకు ముందుగా ప్రకటించినట్లు తాను ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం న్యాయ శాఖా మంత్రి ఆశీస్సులతో నిర్వహిస్తున్నమన్నారు. 12 వ తేదీ కేబినెట్ మీటింగ్ ఉండటంతో కార్యక్రమం ఉదయాన్నే నిర్వహిస్తున్నట్లు ప్రకటించామని అయితే కొందరు సోషల్ మీడియాలో గాలి వార్తలు ప్రచారం చేయడం తగదన్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు తమ్ముళ్లు రావడం లేదని, కార్యక్రమం వాయిదా వేస్తారేమో అని ఊహించి పనిగట్టుకుని సోషల్ మీడియా లో ప్రచారం చెయ్యడం ఏమిటని హరిబాబు ప్రశ్నించారు. ఏదైనా అనుమానం ఉంటే తనను గాని, మంత్రి  కార్యాలయం ను గాని వివరణ తీసుకుని వార్త ఇవ్వాలని అలాంటిది గాలి వార్తలు ప్రచారం చెయ్యడం సరి కాదన్నారు.తెలుగుదేశం పార్టీ కార్యక్షర్తలు, అభిమానులు, బంధువులు శ్రేయోభిలాషులు ఈ గాలి వార్తను నమ్మవద్దని, 12వ తేది అనగా గురువారం ఉదయం టెక్కే మార్కెట్ యార్డ్ కు తరలివచ్చి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని జయప్రదం చెయ్యాలని గుంటుపల్లి హరిబాబు కోరారు.

Share this