బ్రెజిల్ దేశంలోని బ్రెసిలియా నగరం లో ఇటీవల జరిగిన బ్రిక్స్ ( బ్రెజిల్, రష్యా, చైనా, భారత్, దక్షిణాప్రికా దేశాల కూటమి ) 11వ శిఖరాగ్ర సమావేశాలకు భారతదేశం తరుపున బ్రిక్స్ పార్లమెంటరీ మహిళా ఫోరమ్ కు నాయకత్వం వహించి భారతదేశ ప్రతిష్టను ఇనుమరింపజేసి, నంద్యాల ఖ్యాతిని ప్రపంచానికి చాటిన నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరికి అపురూప ఘన స్వాగతం పలికిఉమ్మడి కర్నూలు జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం, భారతీయ జనతా పార్టీ నారీమణులు, కర్నూలు బిల్డర్ అసోసియేషన్, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు గొప్పగా ఘన సన్మానం చేశారు. ఈ సందర్బంగా అఖిల భారత రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి, దక్షిణ భారత బజరంగ్దళ్ కార్యనిర్వాహాక్ టీ.ప్రతాపరెడ్డి, బనగానపల్లె బీజేపీ అసెంబ్లీ ఇంచార్జి బి వి సుబ్బారెడ్డిల ఆధ్వర్యంలో రెడ్డి సామాజిక వర్గం వారందరూ కలిసి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిని సన్మానం చేసి మాట్లాడుతూ యువ పార్లమెంటరీ డాక్టర్ బైరెడ్డి శబరిని సత్కరించుకోవడం ఆనందదాయకంగా ఉన్నదన్నారు. నంద్యాల ఎంపీ గా, రాయలసీమ నుండి ఒక రెడ్డి బిడ్డ ఇంతటి గొప్ప స్థానం సంపాదించడం యావత్ రెడ్డి సామాజిక వర్గానికి గర్వకారణమన్నారు. జయహో బైరెడ్డి శబరి మీరు ఇంకా ఉన్నత పదవులు అజిష్టించాలని కోరికతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో మీరు ఇంకా ఎదగాలని కోరుకుంటూ రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా ఆశిస్తూ ఉన్నదన్నారు.సన్మాన గ్రహిత ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ మీరు చూపిన అభిమానం, ప్రేమ మరువలేనని, మీ నమ్మకాన్ని ఒమ్ము చేయనని, ఎంపీ గా, మీ బిడ్డగా నిరంతరం ప్రజా సేవ చేస్తానని, ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని, నన్ను సన్మానించిన అందరికి ప్రత్యేక ధన్యవాదములు అన్నారు.
బ్రిక్స్ శిఖరాగ్ర సభలో భారత దేశ ప్రతిష్టను పెంచిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి ఘనసన్మానం

Leave a Reply