ఈతకోట శ్రీ కనకదుర్గమ్మవారిని దర్శించుకున్న సెంట్రల్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ కరుటూరి నరసింహారావు

రావులపాలెం  : మండలం పరిధిలోని ఈతకోట గ్రామంలో జాతీయ రహదారి చెంతనే కొత్త సెంటర్ నందు కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మవారిని శుక్రవారం కొత్తపేట నియోజకవర్గం పరిధిలోని ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామ మాజీ సర్పంచ్.వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానం మాజీ చైర్మన్, గోదావరి సెంట్రల్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్, టిడిపి పార్టీ సీనియర్ నాయకులు కరుటూరి నరసింహారావు దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయం 40వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవార్ల దర్శనానికి విచ్చేసిన నరసింహారావుకు ఆలయ కమిటీ చైర్మన్ వెలుగొట్ల రామకృష్ణ కమిటీ సభ్యులు  వారి ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి గోత్ర నామాలతో ఆలయ అర్చకులు ఖండవిల్లి నారాయణచార్యులు (నాని) ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలతో అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.

Share this