నంద్యాల జిల్లా పాణ్యం : తెలంగాణ రాష్ట్ర పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2025 ఫలితాల్లో ఫార్మసీ విభాగంలో శాంతిరాం ఫార్మసీ కళాశాల విద్యార్థిని షేక్ అర్షియా కోనైన్ రాష్ట్రవ్యాప్తంగా మొదటి ర్యాంకు సాధించి నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మధుసూదన చెట్టి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “అధ్యాపకుల అంకితభావ బోధన, శాస్త్రీయ మార్గదర్శకత్వం, విద్యార్థిని అర్షియా ప్రతిభతో ఈ ఘనత సాధ్యమైందన్నారు. ఇది శాంతిరాం ఫార్మసీ కళాశాల విద్యా ప్రమాణాలకు ఒక గొప్ప గుర్తింపు” అని పేర్కొన్నారు.విద్యార్థిని షేక్ అర్షియా కోనైన్ 100 మార్కులు సాధించి, 99.9868 శాతం తో తెలంగాణ రాష్ట్రంలో ఫార్మసీ విభాగంలో 1వ ర్యాంక్ సాధించిందన్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ ఎం. శాంతిరాముడు, డైరెక్టర్ ఎం. శివరాం , డీన్ డాక్టర్ అశోక్ కుమార్ , తదితర అధ్యాపకులు విద్యార్థినిను అభినందించారు.
శాంతిరాం విద్యార్థినికి పీజీ సెట్ ఫలితాల్లో రాష్ట్ర ప్రథమ ర్యాంకు

Leave a Reply