నంద్యాల : స్థానిక పట్టణంలోని 36 వ వార్డులో లబ్ధిదారుకు స్వయంగా రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పింఛన్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా 36 వ వార్డు టిడిపి ఇంచార్జ్ మారుతి ప్రసాద్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామకృష్ణ స్కూల్ వీధిలోని ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అందజేశారు.
ఈసందర్భంగామంత్రిఎన్ఎండిఫరూక్ మాట్లాడుతూ పింఛన్ పంపిణీ చేసినప్పుడు లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం కనిపించిందని అన్నారు . 200 రూపాయలు ఉన్న పెన్షన్ వేయి రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు కే దక్కిందని అన్నారు. అదేవిధంగా 1000/- రూపాయలు ఉన్న పెన్షన్ 2000/- చేసిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. గత ప్రభుత్వంలో 2000 వేలు ఉన్న పెన్షన్ ని 3000 వేల పెంచుతూ ఐదు సంవత్సరాలు గడిపిన వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పారు. ఏట 250/-రు పెంచుతూ ప్రజలను నమ్మకద్రోహం చేశారన్నారు. టిడిపి అధికారం చేపట్టిన వెంటనే అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం 3000/- వేల రూపాయల పెన్షన్ ని 4000 పెంచుతూ అదేవిధంగా మూడు నెలల ముందే ప్రతి నెల 1000 రూపాయలు చొప్పున మొత్తం కలిపి 7000 రూపాయలు అధికారం చేపట్టిన మొదటి నెలలోనే పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అలా ప్రతినెల 1వ తేదీనే పింఛన్ ఇవ్వడం జరుగుతుందని అలాగే ఒకటవ తేదీ ఆదివారం వస్తే 31వ తేదీనే వారికి పింఛన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు . రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా రామకృష్ణ స్కూల్ వీధిలో పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు .అలాగే నంద్యాలలో అన్ని వార్డులలో , అన్ని గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు దగ్గరుండి లబ్ధిదారులకు పింఛన్ అందజేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ అధికారులకు , టిడిపి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న , అసిస్టెంట్ కమిషనర్ వెంకట దాసు , టిడిపి నాయకులు ఉదయ్ కుమార్ , శేఖర్ రెడ్డి , సుధీర్ , చంటి , పుల్లయ్య , సురేష్ , బాబు , దాసు , రూబిన్ , సచివాలయం అడ్మిన్ శర్మ మరియు టిడిపి మహిళా నాయకురాలు దుండగుల వెంకటలక్ష్మి , మేరీ , కళ్యాణి , మాధవి సచివాలయం సిబ్బంది టిడిపి నేతలు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Leave a Reply