ప్రధమనందీశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి సహకరిస్తాం : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి

*  రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణరెడ్డి

నంద్యాల : స్థానిక పట్టణంలోని నవనందులలో ఒకటైన శ్రీ ప్రధమనందీశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి సహకరిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆలయ అభివృద్ధిపై రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంగళవారం మంత్రి ఆనం నంద్యాలకు విచ్చేసిన సందర్భంగా మంత్రి ఫరూక్ ప్రధమనందీశ్వర స్వామి ఆలయ అభివృద్ధిపై మంత్రి ఆనంతో చర్చించారు. ఆలయ మాడవీధులు మరియు నీళ్ల ట్యాంక్ నిర్మాణం కోసం నిధులు విడుదల చేయాలని దేవాదాయ శాఖ మంత్రిని కోరారు. అనంతరం మంత్రి ఆనం కు ఎస్టిమేషన్ పంపిస్తే నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మంత్రులు ఫరూక్ మరియు ఆనంలకు కృతజ్ఞతలు తెలిపారు.

Share this