* ఇండో నేపాల్ అంతర్జాతీయ ఇన్విటేషన్ బాక్సింగ్ టోర్నమెంట్ లో విజేతలు
* ఆంధ్రప్రదేశ్ కు చెందిన 11 మంది బాక్సర్లకు పతకాలు
* విజేతలను అభినందించిన నంద్యాల జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ, కార్యదర్శి ఫయాజ్
నంద్యాల : జూలై 24 నుండి 28వ తేదీ వరకు నేపాల్ లోని పోఖారాలో జరిగిన ఐదవ ఇండో-నేపాల్ అంతర్జాతీయ ఆహ్వాన బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ లోని క్రీడాకారులు వివిధ జిల్లాలకు చెందినవారు 11 మంది బాక్సర్లు వివిధ వెయిట్ కేటగిరీలలో బంగారు పతకాలు సాధించారు.ఈ సందర్భంగా నంద్యాల క్రీడా సమాఖ్య కార్యాలయంలో జరిగిన అభినందన కార్యక్రమంలో నంద్యాల జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ జి. రవికృష్ణ, ప్రధాన కార్యదర్శి ఫయాజ్ లు క్రీడాకారులను, కోచ్ ఆనంద్ ఆచారిని అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ బాక్సింగ్ లో అంతర్జాతీయ పోటీలలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన క్రీడాకారులు విజేతలుగా నిలిచి పతకాలు సాధించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు విజేతలుగా నిలవడంలో విశేష కృషిచేసిన బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఫయాజ్, కోచ్ ఆనందాచారి లను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఫయాజ్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో బాక్సింగ్ క్రీడ అభివృద్ధికి, విద్యార్థులలో,యువతలో బాక్సింగ్ క్రీడ పట్ల ఆసక్తి పెంచడానికి శిక్షణ శిబిరాలు, టోర్నమెంట్లు నిర్వహిస్తామని తెలిపారు.
పతకాలు సాధించిన క్రీడాకారులు : మహేష్,వంశీ, జగదీష్, ప్రసాద్ నాయక్,తిరుమలేష్ సీనియర్ విభాగంలో, జూనియర్ విభాగం లో జస్వంత్ గౌడ్,విష్ణు,సిధార్థ, సబ్ జూనియర్ విభాగంలో చరణ్ తేజ్ రెడ్డి, కళ్యాణ్ కృష్ణ, తోషన్ నాయుడు వివిధ వెయిట్ కేటగిరిలలో విజేతలుగా నిలిచారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఫయాజ్,నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశుల నాగరాజు,కళారాధన నిర్వాహక కార్యదర్శి రంగనాథ్, నంద్యాల జోన్ బాక్సింగ్ ఇంచార్జ్ సర్దార్ ఖాన్, షానవాజ్, పతకాలు సాధించిన క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Leave a Reply