కర్నూలు జిల్లా కౌతాళం : మండల పరిధిలోని ఊరుకుంద గ్రామంలో వెలసిన పుణ్యక్షేత్రం శ్రీ నరసింహ ఈరన్న స్వామి వారి శాశ్వత నిత్యాన్నదాన పథకం కొరకు బెంగుళూరు వాస్తవ్యులైన ఎస్ ప్రగతి మరియు ఎస్ ఖ్యాతి రూ” 50,000 రూపాయలు విరాళముగా చెల్లించారు. వారికి దేవస్థానం డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి శ్రీమతి కే.వాణి చేతుల మీదుగా శ్రీ స్వామి వారి శేష వస్త్రములు లడ్డు ప్రసాదములు బాండ్ పేపరు ఇచ్చి పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన పర్యవేక్షకులు జే కే మల్లికార్జున, సీనియర్ అసిస్టెంట్ జి కిరణ్ కుమార్, దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శ్రీ నరసింహ ఈరన్న స్వామి శాశ్వత నిత్యాన్నదాన పథకానికి విరాళం

Leave a Reply