తిరుపతి : ఒడిస్సా రాష్ట్రం కటక్ జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ రెండో తేదీ జరిగిన టైక్వాండో కైరోగి పుంసే నాలుగవ సబ్ జూనియర్, సీనియర్ నేషనల్ ఛాంపియన్ షిప్ పోటీలలో తిరుపతికి చెందిన రాగి పాలెం విహాస్ బ్రాంజ్ మెడల్ ను కైవసం చేసుకున్నారు. విహాస్ టైక్వాండో కైరోగి పుంసే సబ్ జూనియర్ అండర్- 38 కిలోల బాలుర విభాగంలో ప్రత్యర్థిని చిత్తుచిత్తుగా ఓడించి విహాస్ అత్యధిక పాయింట్లతో బ్రాంజ్ మెడల్ గెలుపొందారు. రాయలసీమ ఉమ్మడి జిల్లాల నుంచి మొట్టమొదటిసారిగా జాతీయస్థాయి టైక్వాండో పుంసే సబ్ జూనియర్ పోటీలకు విహాస్ హాజరై తొలి కాంస్య పతకాన్ని సాధించారు. ఆ విద్యార్థి కాంస్య పతకం సాధించడం పట్ల రాయలసీమ జిల్లాలలోని టైక్వాండో క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారు. ఈ విజయానికి తోడ్పడిన కోచ్ లు, మేనేజర్లు, గోవర్ధన్ పవన్ కుమార్ సాయిరాం రోహిత్ కు రుణపడి ఉంటానని విహాస్ తెలిపారు. బ్రాంజ్ మెడల్ సాధించిన విహాస్ ను ఆంధ్రప్రదేశ్ టైక్వాండో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కృష్ణ, వెంకటేశ్వర్లు ప్రత్యేకంగా అభినందించారు.
జాతీయ టైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీలలో బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకున్న రాగిపాలెం విహాస్

































Leave a Reply
View Comments