వాజ్ పేయి  విగ్రహ ఆవిష్కరణ

నంద్యాల : స్థానిక పట్టణంలోని  జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో మాజీప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహఆవిష్కరణ కార్యక్రమం బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు ఆధ్వర్యంలో  ఘనంగానిర్వహించారు. ఈ కార్యక్రమంలో  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి. ఎన్ మాధవ్, మంత్రులు సత్య కుమార్ యాదవ్, ఫరూక్, జనార్దన్రెడ్డి పాల్గొన్నారు. వాజ్ పేయి పాలనలో సుపరిపాలన,జాతీయ ఐక్యత, సమగ్ర అభివృద్ధి విధానాలు దేశానికికొత్త దిశ చూపించాయని వారన్నారు.