దేశ భక్తి చాటుకున్న వైద్యులు

*   శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

​ నంద్యాల : వైద్యం కేవలం వృత్తి మాత్రమే కాదు, అదొక సామాజిక బాధ్యత అని చాటుతూ స్థానిక శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆసుపత్రి ప్రాంగణంలో దేశభక్తి వెల్లివిరిసింది. తెల్లకోటు ధరించిన వైద్యులు సేవతో పాటు దేశభక్తిలోనూ తాము ముందుంటామని నిరూపించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి  జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశాన్ని ఆరోగ్య భారత్‌గా మార్చడంలో వైద్యుల పాత్ర మరువలేనిదని కొనియాడారు.​ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్లు మరియు వైద్య బృందం సభ్యులు డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ భార్గవ వర్ధన్ రెడ్డి,డాక్టర్ పాండురంగారావు, డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి  మాట్లాడుతూ రోగికి చేసే సేవ దేశానికి చేసే సేవతో సమానమని భావిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగం కల్పించిన స్ఫూర్తితో సామాన్యుడికి సైతం అత్యాధునిక వైద్యాన్ని చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వారు పేర్కొన్నారు.​అనంతరం రోగులకు, వారి బంధువులకు మిఠాయిలు పంపిణీ చేసి పండుగ వాతావరణాన్ని నింపారు.​ఈ వేడుకల్లో ఆసుపత్రి సిబ్బంది, రోగుల సహాయకులు మరియు స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.