* ఈనెల 30న ముచ్చోనిపల్లికి పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ రాక
జోగులాంబ గద్వాల జిల్లా : ఐజ మున్సిపాలిటీ కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు ఐజ ఆంజనేయులు మాదిగ ఆధ్వర్యంలో గట్టు మండలం ముచ్చనిపల్లి గ్రామంలో ఈనెల 30వ తేదీన భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ విచ్చేయుచున్నారు.కాబట్టి ఈ సందర్భంగా ముచ్చోనిపల్లి అంబేద్కర్ విగ్రహావిష్కరణ కమిటీ ఐజ మండల ఎమ్మార్పీఎస్ నాయకులు వివిధ సంఘాల ఆధ్వర్యంలో గోడ పత్రిక విడుదలచేశారు.
ఈ సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లాలోని ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి దాని అనుబంధ సంఘాలు కుల సంఘాలు, అభ్యుదయ సంఘాలు మరియు ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు డాక్టర్ రాజు, క్రిస్టఫర్, చాగదోన తిమ్మన్న, బల్లి ప్రసాద్, తూముకుంట కిష్టన్న, తప్పెట్ల మోరుసు తిమ్మప్ప, విగ్రహావిష్కరణ కమిటీ సభ్యులు దేవేందర్, భాస్కర్, యోహాను, వీరేష్, మోషన్న, పల్లెన్న, అశోక్, దుబ్బ వీరేషు, ప్రసాద్, వీరన్న తదితరులు పాల్గొన్నారు
Leave a Reply