తిరుపతి : ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ (APJSA) గౌరవ అధ్యక్షులు బోళ్ల సతీష్ బాబు, అధ్యక్షుడు ఓబులం ప్రసాద్, ప్రచార కార్యదర్శి నాగలింగ స్వామి, ట్రెజర్ రెడ్డప్ప , కార్యవర్గ సభ్యులు పిట్టం నాగవర్ధన్ రెడ్డి , ఓబులంపల్లి రామక్రిష్ణ లు త్వరలో ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ కు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆహ్వాసం పలికారు.శనివారం తిరుపతి ఎమ్మెల్యే నివాసంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా క్రీడల నిర్వహణ తీరును, రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చే జర్నలిస్ట్ జట్ల వివరాలను ఎమ్మెల్యేకు వివరించారు.
తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులును కలిసిన ఏపీ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్

































Leave a Reply
View Comments