ఎంపి బైరెడ్డి శబరి ని మర్యాద పూర్వకంగా కలిసిన బేడ బుడగజంగాలు

ప్రజాపవర్ కర్నూలు : స్థానిక నగరంలో నంద్యాల ఎంపి బైరెడ్డి శబరి  స్వగృహం నందు మర్యాద పూర్వకంగా  బేడ బుడగజంగం రాష్ట్ర అధికార ప్రతినిధి నంద్యాల టౌన్ 38వ వార్డు వై.యస్.ఆర్ నగర్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ తాటికొండ బుగ్గరాముడు కలిశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీ పార్లమెంట్ నందు బేడ బుడగజంగాల గురించి ప్రస్తావించిన ఎంపీ శబరి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతే కాక  రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు  అధ్యక్షతన బేడ బుడగజంగాలను ఏస్సి జాబితాలో చేర్చాలని కేంద్రానికి లేఖ పంపిన సీఎం చంద్రబాబు కి కృతజ్ఞతలు  తెలిపారు.

Share this