విమాన ప్రమాద మృతులకు సంతాపంగా కొవ్వొత్తుల వెలిగించి సంతాపం

నందలూరు :  గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో జరిగిన విమాద ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఇవాళ అరవపల్లి బంగ్లా ఆవరణమునందు లయన్స్ క్లబ్ మరియు వాకర్స్ క్లబ్స్  ఆధ్వర్యంలో  కొవ్వొత్తులు వెలిగించి సంతాపం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా మన్నెం.రామమోహన్ ఎస్ఐ మరియు వాకర్స్ కార్యదర్శి ఉప్పుశెట్టి సుధీర్లు మాట్లాడుతూ ప్రమాదం ఊహించని పరిణామం అని, ప్రతి ఒక్కరూ సంఘటితంగా సంతాపం తెలుపుతూ ఆ కుటుంబాలకు బాసటగా నిలవాల్సిన  అవసరం ఎంతైనా ఉందని విమానంలో ప్రయాణిస్తూమృతి చెందిన వారే కాకుండా అభం శుభం తెలియని వైద్య కళాశాల లో ఉన్నవారు కూడా మృతి చెందిన అత్యంత బాధాకరమని కావున మృతి చెందిన కుటుంబీకులకు  తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

  ఈ కార్యక్రమంలో విభా ఎరుడైట్ స్కూల్ చైర్మన్ డాక్టర్ జయభాస్కరరావు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు కుర్రా మణి యాదవ్, మోడపోతుల రాము, గురు ప్రసాద్, గండికోట కృష్ణకుమార్, కాన కుర్తి వెంకటయ్య, కొత్తపల్లి రాజా చారి, తాటి సుబ్బరాయుడు, ఆంజనేయులు, మేస్త్రి శంకర్, సయ్యద్ అమీర్, ఆనాల మధు, పు త్త వెంకటేష్, కొండిశెట్టి సుదర్శన్ యంబులూరు ప్రదీప్, చామంచి పెంచలయ్య, పసుపులేటి సుబ్రహ్మణ్యం,ప్రజా ప్రతినిధి మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Share this