బి జె పి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా చింతా నాగేశ్వరరావు ప్రకటించిన  జిల్లా అధ్యక్షుడు  అభిరుచి మధు  

 నంద్యాల :   భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ కమిటీని నంద్యాల జిల్లా అధ్యక్షుడు  అభిరుచి మధు  ప్రకటించారు. ఈ కమిటీలో బండి ఆత్మకూరు మండలానికి చెందిన చింతా నాగేశ్వరరావు ని బిజెపి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా నియమించారు. ఈ సందర్భంగా చింతా నాగేశ్వరరావు మాట్లాడుతూ నాపై నమ్మకం నుంచి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా నియమించిన జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు కి , జిల్లా, రాష్ట్ర కమిటీకి, నంద్యాల జిల్లా కార్యకర్తలకు ధన్యవాదములు తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  ప్రభుత్వం చేస్తున్న, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.

Share this