మహిళా సంక్షేమం, అభివృద్దే సీఎం చంద్రబాబు ద్యేయం

నంద్యాల : ఎన్నికల్లో ఇచ్చిన మరో హమీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉమ్మడి ప్రభుత్వం నెరవేర్చింది.ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ మహిళలకు ఆర్ టి సి బస్సు ప్రయాణం నేటి నుంచి అమలు చేస్తూ నెరవేర్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని, మహిళా సంక్షేమం సీఎం ద్యేయమని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి శనివారం నంద్యాల జిల్లా ప్రజలకు శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు చెబుతూ అన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చిందనీ, మహిళా సంక్షేమం, అభివృద్దే ధ్యేయంగా ఉచిత గ్యాస్, తల్లికి వందనం, ఉచిత ఆర్ టి సి బస్సు ప్రయాణం తదితర పథకాలను మహిళలకు అందించామన్నారు. ప్రభుత్వ పథకాలు మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్ధికంగా అభివృద్ధి చెందాలని, మహిళా పక్షపాతి సీఎం చంద్రబాబు అని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కొనియాడారు.

Share this