పేద రోగులకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో భరోసా : మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి

నంద్యాల జిల్లా /నందికొట్కూరు : పేద రోగులకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో భరోసా ఇస్తుందని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. ఆదివారం ముఖ్యమంత్రి సహాయనిధి  రూ.1,04,508 లక్షల చెక్కునునందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి నగర్ కు చెందిన తక్షిత అనే బాలిక కు వైద్యం కోసం చిన్నారి తండ్రి అమలదిన్నె ప్రవీణ్ కు బైరెడ్డి రాజశేఖరరెడ్డి అందజేశారు. ఈ సందర్బంగా  బైరెడ్డి మాట్లాడుతూ నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి విన్నపం మేరకు ఆమె సిఫారసు చేసిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధితులను ఆదుకునేందుకు పేద రోగులకు భరోసా కల్పించేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేయడం అభినందనీయం అన్నారు.

Share this