నంద్యాల జిల్లా/నందికొట్కూరు : స్థానిక పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు నిర్వహించిన పత్రిక మీడియా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ యువతకు ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాం.పారదర్శకంగా మెగా డీఎస్సీ నిర్వహించాం ప్రతి ఏటా మెగా డీఎస్సీ నిర్వహించి యువ ఉపాధ్యాయులతో విద్య రంగాన్ని దేశంలోనే తొలి స్థానంలో నిలబెడతాం అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులకు వయస్సు మినహాయింపు ఇచ్చి వారికీ అండగా నిలబడ్డాం. యువత బాగుపడటం ఇష్టంలేని జగన్మోహన్ రెడ్డి మెగా డీఎస్సీని ఆపడానికి 24 కేసులు వేయించాడు, అవన్నీ తట్టుకుని మెగా డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేసిన ఘనత లోకేష్ కి దక్కుతుంది. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు స్టూడెంట్ టీచర్ రేషియో కి సరిపడ ఉపాధ్యాయులు ఉంటేనే విద్యారంగ ముఖచిత్ర మార్చగలిగేది అని నమ్మిన విద్యావంతుడు నారా లోకేష్ నాయకత్వంలో యువత కల నిజమైంది. ప్రభుత్వ విద్యలో విద్యాప్రమాణాలను మెరుగుపర్చేందుకు గత 14నెలలుగా సమర్ధవంతంగా సంస్కరణలు అమలు చేస్తూ బడులకు నూతన వెలుగులు తెస్తున్న నారా లోకేష్ అనంతరం 2014-2019 టీడీపీ ప్రభుత్వం2014-19 మధ్య 2 డీఎస్సీలు జరిపి 18వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసింది టీడీపీ ప్రభుత్వం. అన్నారు.చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల ముఖ్యమంత్రి హోదాలో దాదాపు 13 డీఎస్సీలు జరిపి 1,80,208 పోస్టులు భర్తీ చేసి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల్లో అధిక భాగం ఆయన హయాంలో ఉద్యోగాలు పొందినవారే. అన్నారు ఎమ్మెల్యే గిత్త జయసూర్య 1996 నుంచి 2025 వరకు భర్తీ చేసిన 1,96,619 పోస్టులు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సమగ్ర శిక్షా సొసైటీ ఆధ్వర్యంలోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 729 నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేసింది.90 మంది ST యువతను కొత్తగా ఉపాధ్యాయులుగా నియమించింది.700 కోయభారతి టీచర్ పోస్టులు భర్తీ చేశాము.జూనియర్ కాలేజీల్లో 700 మంది సిబ్బంది సేవలు పునరుద్ధరణ చేశాము.476 ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో 3619 మంది కాంట్రాక్టు లెక్చరర్ల సేవలు పునరుద్ధరణ చేశాము.టీచర్లపై పని ఒత్తిడి తగ్గించేందుకు గత ప్రభుత్వంలో ఆరు రకాల బడుల విధానం ఉండగా కూటమి ప్రభుత్వం వాటిని తొమ్మిది రకాల బడులుగా మార్చింది అన్నారు ఎమ్మెల్యే గిత్త జయసూర్య.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, కతా రమేష్ రెడ్డి, లక్ష్మీ నారాయణ రెడ్డి,ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.
పారదర్శకంగా మెగా డీఎస్సీ నిర్వహించిన కూటమి ప్రభుత్వం : ఎమ్మెల్యే గిత్త జయసూర్య

Leave a Reply