టీడీపీతోనే ఒంటిమిట్ట అభివృద్ధి  

కడప జిల్లా/ఒంటిమిట్ట  : స్థానిక పట్టణంలోని ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభించిందని టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి అద్దులూరి ముద్దుకృష్ణారెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ మంత్రి ఎన్ఎండి ఫరూక్ , చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు , కడప నగర మైనారిటీ నాయకులు అమీర్ బాబు, శాప్ ఛైర్మన్ రవినాయుడు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు.ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి  ఫరూక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు కూలంకుశంగా వివరించారు. అలాగే టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి అద్దులూరి ముద్దుకృష్ణారెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Share this