లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ

*   శ్రీరామ డిజిటల్స్ చంద్రమోహన్ సౌజన్యంతో 100 విగ్రహాల పంపిణీ.

*  పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకుల పూజలు ప్రోత్సహించండి: డాక్టర్ రవి కృష్ణ

నంద్యాల  : స్థానిక పట్టణంలోని నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీరామ డిజిటల్ యజమాని,లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు చంద్రమోహన్ సౌజన్యంతో  వినాయక చవితి పర్వదినం పురస్కరించుకుని మట్టి వినాయక విగ్రహల పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు,కార్యదర్శి  తాతిరెడ్డి భాస్కర రెడ్డి ల నిర్వహణలో బాలాజీ కాంప్లెక్స్ లో శ్రీరామ డిజిటల్ వద్ద  జరిగిన ఈ కార్యక్రమంలో ఐ ఏమ్ ఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు మట్టి విగ్రహాలను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి వాటి స్థానంలో మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించాలని,మట్టి వినాయక విగ్రహాల పంపిణీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో  విగ్రహాల దాత చందా చంద్రమోహన్ , లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు  సోమేసుల నాగరాజు,కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర్ రెడ్డి లయన్స్ క్లబ్ సభ్యులు ఎంపీవి రమణయ్య, శిరిగిరి రమేష్, పోసిన సుబ్బారావు,మామిళ్ల నాగరాజు, రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Share this