పేద దివ్యాంగులకు వినాయక చవితి పండగ సరుకుల పంపిణీ

* లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మదర్ తెరిసా జన్మదిన సేవా కార్యక్రమం

*   పోసిన సిల్క్స్ అధినేత పోసిన సుబ్బారావు సౌజన్యంతో

*  మదర్ తెరిసా స్ఫూర్తితో సేవా కార్యక్రమాల నిరంతర నిర్వహణ:డాక్టర్ రవి కృష్ణ

నంద్యాల  :  సేవా స్ఫూర్తి ప్రదాత మదర్ తెరిసా జన్మదినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో  లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు, పోసిన సిల్క్స్ అధినేత పోసిన సుబ్బారావు సౌజన్యంతో పేద దివ్యాంగులకు వినాయక చవితి పండుగ సరుకులు పంపిణీ చేశారు. నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు ముఖ్యఅతిథిగా  పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ ప్రపంచంలో సేవకు  ప్రతీకగా నిలిచి, ఆపన్నులకు చేయూత నిచ్చిన మదర్ తెరిసా స్ఫూర్తితో లయన్స్ క్లబ్, దివ్యాంగుల సంక్షేమ సంఘం, ఐఎంఏ ద్వారా సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని  అన్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం అందించే చేతులు మిన్న అనీ ప్రబోధించిన మదర్ తెరిసా మానవాళికి నిరంతర స్ఫూర్తి ప్రదాతగా చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు ,ఉపాధ్యక్షులు,సేవా కార్యక్రమ  దాత పోసిన సుబ్బారావు,కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర రెడ్డి, నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీ వి రమణయ్య, లయన్స్ క్లబ్ సభ్యులు మేడం చంద్రశేఖర్, రామయ్య, దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Share this