* జాతీయ స్కూల్ చెస్ టోర్నమెంట్ కు రాష్ట్ర జట్టు ఎంపిక
నంద్యాల : ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా చెస్ సంఘం నిర్వహణలో స్థానిక పట్టణంలోని నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో రాష్ట్రస్థాయి ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ ప్రారంభించారు. రాష్ట్ర చెస్ సంఘం నిర్వాహక కార్యదర్శి, నంద్యాల జిల్లా చెస్ సంఘం ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి నిర్వహణ లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ జి.రవి కృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ చదరంగం మేధాశక్తిని పదును పెట్టే క్రీడ అని, క్రీడాకారులలో ఏకాగ్రతను ఇనుమడింప చేస్తుందన్నారు. విద్యార్థులను చదువుతోపాటు క్రీడలలో ప్రోత్సహించాలని తల్లిదండ్రులను,విద్యా సంస్థల నిర్వాహకులను కోరారు. నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ నెరవాటి కృష్ణ సాయి రోహిత్ మాట్లాడుతూ నంద్యాలలో చెస్ సంఘం ఆధ్వర్యంలో తరచూ చెస్ టోర్నమెంట్లు నిర్వహించడం ద్వారా ఈ క్రీడకు నంద్యాలలో మంచి ప్రాచుర్యం వచ్చిందన్నారు. లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ పి.వి. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ చదరంగంలో విజయానికి పావులు కదిపిన విధంగానే జీవితంలో విజయం సాధించడానికి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ పి.వి సుధాకర్ రెడ్డి, రోటరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ సుబ్బయ్య, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సోమేశుల నాగరాజు, తాతిరెడ్డి భాస్కర రెడ్డి,కోశాధికారి అమిదేల జనార్ధన్,నేషనల్ ఆర్బిటర్ గోవింద జీయర్,జిల్లా చెస్ సంఘం సంయుక్త కార్యదర్శి రాజా చక్రవర్తి, టోర్నమెంట్ కోఆర్డినేటర్ సుజాత, వివిధ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో వచ్చిన క్రీడాకారులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Leave a Reply