జిల్లా స్థాయి చెస్ పోటీల కరపత్రాలను విడుదల చేసిన జిల్లా చెస్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ రవి కృష్ణ, రామ సుబ్బారెడ్డి

*  ఆగస్టు 28 వ తేదీ నంద్యాల జిల్లా స్థాయి చెస్ పోటీలు

*  రాపిడ్ అండ్ బ్లిట్జ్    ప్రత్యేక విభాగాలలో( ఏ వయస్సు వారైనా పాల్గొనవచ్చు)

*  సెప్టెంబర్ 13 , 14 వ తేదీలలో నంద్యాల జిల్లాలోనే జరగబోవు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే నంద్యాల జిల్లా జట్టు ఎంపిక

నంద్యాల  : స్థానిక  పట్టణంలో చెస్ పోటీల కరపత్రాలను నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ రవి కృష్ణ, రామ సుబ్బారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  సెప్టెంబర్ నెల 13వ, 14వ తేదీలలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ & నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించబోయే రాష్ట్రస్థాయి చెస్ పోటీలలో పాల్గొనే నంద్యాల జిల్లా జట్టు ఎంపిక కోసం నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు నెల 28 వ తేదీ గురువారం  ఉదయం 9 గంటల కు  శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ స్వామి వివేకానంద ఆడిటోరియంలో నంద్యాల జిల్లా స్థాయి రాపిడ్ అండ్ బ్లిట్జ్  వేరు వేరు విభాగాలలో చెస్ పోటీలు  నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆగస్టు నెల 27 వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు ఏపీ చెస్ వెబ్ సైట్  లో  ఎంట్రీలు నమోదు చేసుకావాలన్నారు. ఇతర వివరాలకు 9010451585 నెంబరును సంప్రదించాలన్నారు.

Share this