ఆదోని /కౌతాళం : మండల పరిధిలోని ఊరుకుంద గ్రామంలో వెలసిన పుణ్యక్షేత్రం శ్రీ నరసింహ ఈరన్న స్వామి కి బళ్లారి వాస్తవ్యులు కృష్ణ చైతన్య శ్రీ స్వామివారి ఆలయ జీర్ణోద్ధరణ కొరకు ₹ 1,38,123 రూపాయలు విరాళముగా చెల్లించారు. వారికి దేవస్థానం ఆలయ డిప్యూటీ కమిషనర్ మరియు కార్య నిర్వహణ అధికారి మేడేపల్లి విజయరాజు వారి చేతుల మీదుగా శ్రీ స్వామి వారి శేష వస్త్రము లడ్డు ప్రసాదము మరియు బాండు పేపరు ఇచ్చి పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన పర్యవేక్షకులు జె మల్లికార్జున, కే వెంకటేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్ జే వీరేష్ పాల్గొన్నారు
శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థాన ఆలయ జీర్ణోద్ధరణ కొరకు విరాళం

Leave a Reply