* కలుగట్ల గ్రామంలో ఉచిత వైద్య శిబిరంకు విశేష స్పందన
నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం కలుగట్ల గ్రామంలో ఉచిత వైద్య శిబిరంకు విశేషస్పందన లభించింది.నంద్యాల శ్రీ రామకృష్ణ విద్యాసంస్థల అధినేత డాక్టర్ జి. రామకృష్ణారెడ్డి గత 40 ఏళ్లుగా సొంత గ్రామం కలుగట్ల గ్రామంలో వివిధ సేవా కార్యక్రమాలతో జన్మభూమి ఋణం తీర్చుకుంటున్నారు. గత 40 ఏళ్లుగా కలుగట్ల గ్రామంలోని డిగ్రీ, పీజీ విద్యార్థుల తన విద్యాసంస్థలో ఉచిత విద్య అందిస్తున్నారు.తమ సొంత గ్రామమైన కోవెలకుంట్ల మండలం కలుగొట్ల గ్రామంలో ఉచితంగా కంటి, మధుమేహం, బిపి వంటి రోగాల నివారణ కోసం ప్రఖ్యాత డాక్టర్ లను తీసుకొని వచ్చి శిబిరం నిర్వహించారు. ఈ మూడు రోగాలతో ఎంతో మంది బాధ పడుతున్నారని, ప్రభుత్వ, ప్రవైట్ ఆసుపత్రులకు వెళ్లి చెక్ చేసుకోలేని వారికోసం ఉచిత శిబిరం ఏర్పాటు చేశారు.మాటలలో చెప్పలేని సహాయం డాక్టర్ జి. రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సతీమణి విజయ కుమారి, కొడుకు, కోడలు హేమంత్ రెడ్డి, ప్రగతి రెడ్డిలు చేస్తున్నారు. నడవలేని రోగులను వారే స్వయంగా డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లి వైద్య సేవలు అందించారు. డాక్టర్లకు వైద్య శిబిరంలో సహాయకులు అవధూత శ్రీకాశిరెడ్డి నాయన భక్త బృందం రోగులకు సేవలు అందించారు. గ్రామ పెద్దలు నాగార్జునరెడ్డి తదితరులు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన డాక్టర్ జి. రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు, అవధూత శ్రీ కాశిరెడ్డి నాయన భక్త బృందంకు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నామన్నారు.
Leave a Reply