కెఎం రెడ్డి దంత వైద్యశాలలో ఉచిత దంత వైద్య శిబిరం

* నవ్యాంధ్ర బైక్ మెకానిక్అసోసియేషన్ సభ్యులకు ఉచిత

దంత అవగాహన

* 50 మంది బైక్ మెకానిక్ లకుఉచితంగా దంత పరీక్షలు

* నోటిని ఆరోగ్యంగా ఉంచుకుంటేఎన్నో రకాల రోగాలను

అరికట్టవచ్చు.

* డాక్టర్ కెఎం రెడ్డి దంత వైద్యశాల అధినేత డాక్టర్ కె ఎం రెడ్డి

నంద్యాల : నోటిని ఆరోగ్యంగాఉంచుకుంటే ఎన్నో రకాల రోగాలను అరికట్టవచ్చని కెఎం రెడ్డి దంత వైద్యశాల అధినేత డాక్టర్ కెఎం. రెడ్డితెలిపారు. స్థానిక పట్టణంలోని కెఎం రెడ్డి దంత వైద్యశాలలో నవ్యాంధ్ర బైక్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులకు ఉచిత దంతఅవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 50 మంది బైక్ మెకానిక్ లకుఉచిత దంత పరీక్షలు నిర్వహించి ఉచిత దంత వైద్యాన్ని అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ కెఎంరెడ్డి బైక్ మెకానిక్ లకు పలు సూచనలు చేశారు.దంతాలను ఎలా పరిశుభ్రం చేసుకోవాలో డెమోప్రదర్శన ద్వారా చూపించారు. దంత సంరక్షణ చర్యలగురించి అవగాహన కల్పించారు, దంతాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోతే జరిగే నష్టాలను వివరించారు.కనీసం ఆరు నెలలకు ఒకసారి దంత పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పొగ తాగడం, గుట్కా, పాన్ మసాలా వల్ల జరిగే నష్టాలు వివరించి అవగాహన కల్పించారు. అనంతరం డాక్టర్ కెఎం. రెడ్డి మాట్లాడుతూ మానవ శరీరంలో గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు అతిముఖ్యమైనవని దంతాలకు కూడా వాటంత ప్రాధాన్యంఉందన్నారు. 32 పన్నుల్లో ఒకటిపోయినా ఇబ్బంది ఏమి ఉండకపోవడంతో అందరూ తేలికగా తీసుకుంటారని అయితే మానవ శరీరంలో ఉన్న అవయవాలు సమర్ధవంతంగా పనిచేసేందుకు శక్తినిచ్చేది మాత్రం దంతాలే అన్నారు. ఆహారాన్నినమిలి మింగడానికి ఇది దోహద పడుతుందని, అప్పుడే శరీరానికి కావాల్సినంత శక్తి సమకూరుతుందని తెలిపారు. నోటిని ఆరోగ్యంగా ఉంచుకుంటే ఎన్నో రకాల రోగాలను అరికట్టవచ్చని తెలిపారు. అనంతరం బైక్ మెకానిక్ అసోసియేషన్ నాయకులు రాష్ట్ర ఇన్చార్జి అధ్యక్షుడు నూర్ భాషా, ముఖ్య సలహాదారుడు రాముడు, వన్ టౌన్ అధ్యక్షుడు మహమ్మద్ రఫీ ,టూ టౌన్ అధ్యక్షుడు సూరి , ఉపాధ్యక్షుడు సౌదీ మహమ్మద్ రఫీ, సెక్రటరీ గౌస్ మొహిద్దిన్, ట్రెజరీ అనిల్ ,జాయింట్ సెక్రటరీ చంద్రశేఖర్ ఆచారి, 10 మండలాల ఇన్చార్జి అన్వర్ భాష, 20 మండలాల ఇంచార్జ్ బాలి రెడ్డి, సభ్యులు ఉచిత దంత పరీక్షలు నిర్వహించిన డాక్టర్ కె.ఎం. రెడ్డి, డాక్టర్ సింధుజ,డాక్టర్ శ్రావణి లను ఘనంగా సత్కరించారు.