ఫాదర్స్ డే సందర్భంగా ఉచిత డెంటల్ పరీక్షలు

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా/రావులపాలెం : మండల కేంద్రంలో ఆదివారం ఫాదర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రావులపాలెంలో నవభారత లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎపెక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యులు పలువురికి ఉచితంగా డెంటల్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డా.పి.అపర్ణ,డా.హిప్నో పద్మా కమలాకర్,డా.సి.హెచ్.మౌనికడా.సిహెచ్.శ్రవణ్ కుమార్ డా.రమేష్ కుమార్,పి.దేవి, పి.చరిత తదితరులు పాల్గొన్నారు.

Share this