నంద్యాల : జిల్లా కేంద్రంలోని ఆర్ టీ సి బస్టాండ్ ఆవరణలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఎంపీ నిధులతో ఆర్ టీ సి కార్మికులు, ఉద్యోగులు, ప్రయాణికుల సౌకర్యం కోసం ఉచిత మినరల్ వాటర్ ఫ్లాంట్ నిర్మాణం జరుగుతుందని సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ నరహరి విశ్వనాధ్ రెడ్డి, ఆర్ టీ సి రీజనల్ మేనేజర్ రజియా సుల్తాన చెప్పారు. సోమవారం నంద్యాల ఆర్ టీ సి బస్టాండ్ ప్రాంగణంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఎంపీ నిధులతో చేపట్టే మినరల్ వాటర్ ఫ్లాంట్ నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించారు. ప్రయాణికులు, కార్మికులు, ఉద్యోగుల కోసం మినరల్ వాటర్ ఫ్లాంట్ ఎంపీ డాక్టర్ శబరి మంజూరు చేయడం అభినందనీయం అని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ డబ్ల్యూ ఎస్ ఏ ఈ సురేష్, టీడీపీ నాయకులు అజయ్, మనోజ్, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆర్ టీ సి బస్టాండ్ ప్రాంగణంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి నిధులతో మినరల్ వాటర్ ఫ్లాంట్ నిర్మాణానికి భూమి పూజ

Leave a Reply