నంద్యాల : స్థానిక పట్టణంలోని టేక్కే మార్కెట్ యార్డ్ నందు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా గుంటుపల్లి హరిబాబు బాధ్యతలు స్వీకరించారు.అనంతరం కార్యాలయ సిబ్బంది వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతన మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు . రైతులకు ఏ కష్టం వచ్చినా నేను ముందుండి సమస్యను పరిష్కరిస్తానన్నారు . ఈ బాధ్యత తీసుకున్న అనంతరం మరింత బాధ్యత నాపై పెరిగిందని రైతులకు కచ్చితంగా అండగా ఉంటామన్నారు. అలాగే నాకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి , ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి , మంత్రులు నారా లోకేష్ కి , ఎన్ఎండి ఫరూక్ కి మరియు టీడీపీ నాయకులకు, అధికారులకు , శ్రేయోభిలాషులకు అందరికీ రుణపడి ఉంటానని తెలిపారు.
మార్కెట్ యార్డ్ చైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించిన గుంటుపల్లి హరిబాబు

Leave a Reply