* అభినందించిన కళాశాల యాజమాన్యం
నంద్యాల : స్థానిక పట్టణంలోని సంజీవనగర్ కు చెందిన ఇంద్రాణి మొదటి సారిగా రాసిన డీఎస్సీలో మంచి ర్యాంకులు సాధించింది. జోహార్ కళాశాలలో ఇంద్రాణికి జిల్లా స్థాయిలో 3 ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 73 వ ర్యాంక్ సాధించి డిఎస్సిలో అత్యున్నత మార్కులు సాధించి ఉపాధ్యాయురాలుగా విజయ సాధించారు. మహానంది దేవస్థానంలో సహాయ పూజారిగా పనిచేస్తున్న సూర్య నారాయణ, సరస్వతమ్మల కూతురు ఇంద్రాణి. తన తల్లి ఎస్జీటీ ఉపాధ్యాయురాలు కావడం తనకు కలసి వచ్చిందన్నారు. జోహార్ కళాశాల చైర్మన్ జోహార్ హుస్సేన్ మాట్లాడుతూ మన కళాశాల విద్యార్థులు ఎస్జిటి, ఎస్ఎ, హెచ్ పిటిగా విజయం సాధించి కళాశాలకు మంచి పేరు తీసుకువచ్చిన విద్యార్థులందరికీ జోహార్ కళాశాల యాజమాన్యం, ఆధ్యాపకబృందం అభినందనలు తెలియజేసారు.
Leave a Reply