గుంటూరు : ఆకలితో ఉన్నవారికి ఒక్కపూటైనా భోజనం పెడితే ఎంతో సంతృప్తిగా ఉంటుందని ప్రతి ఒక్కరు రోజంతా శ్రమించేది అన్నం కోసమేనని జన చైతన్య సమితి కార్యదర్శి అన్నవరపు స్టాలిన్ బాబు అన్నారు.పల్నాడు జిల్లా పెదకూరపాడుకు చెందిన వడ్లమూడి వెంకటేశ్వర్లు గృహంలో జరిగిన ఫంక్షనలో ఆహారం మిగిలిన విషయాన్ని కొర్లకుంట శ్రీనివాసరావు జన చైతన్య సమితి వారికి శబ్దయంత్రం ద్వారా సమాచారం తెలపటంతో రాత్రి 11 గంటల సమయంలో వెంకటేశ్వర్లు గృహము వద్దకు వెళ్లి మిగిలిన ఆహార పదార్థాలను సేకరించి గురువారం రాత్రి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు ప్రభుత్వ వైద్యశాల, రైల్వే స్టేషన్ వద్దకు రాత్రి 12 గంటల సమయంలో తీసుకువెళ్లి తెల్లవారుజామున మూడు గంటల వరకు 150 మందికి భోజనాన్ని పంపిణీ చేశారు.ఈసందర్భంగా స్టాలిన్ బాబు మాట్లాడుతూ ఏ ఫంక్షన్లలోనైనా ఆహారం మిగిలి ఉంటే ఆహారాన్ని వృధా చేయవద్దని మిగిలిన ఆహారం గురించి సమాచారం ఇస్తే ఆఆహారాన్ని తెచ్చి పేదలకు పెడతామని వివరాలకు 888677 7767,9848977677 నంబర్లకు సమాచారం ఇవ్వొచ్చని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్ సయ్యద్ ఖాదర్ బాషా మాట్లాడుతూ నిద్ర లేకపోయినా ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.జన చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసరి విజయ్ బెన్నిబాబు మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో ఆహారం మిగిలిన రాత్రి సమయంలో గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి, రైల్వే స్టేషన్ వద్దకు తీసుకువెళ్లి ఆకలితో ఎదురుచూసే వారికి భోజనం పెడతామని అన్నారు.ఈ సందర్భంగా 155 మందికి భోజనాన్ని పంపిణీ చేశారు.
ఆకలితో ఉన్నవారికి ఒక్కపూటైనా భోజనం పెడితే ఎంతో సంతృప్తి

Leave a Reply