నంద్యాల జిల్లా గడివేముల : వినాయక చవితి పండుగను బుధవారం ప్రజలు ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. వీధి వీధి వాడవాడలా మండపాలు ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచి స్వామివారికి పూజలు అభిషేకాలు చేస్తున్నారు. హిందూమతంలో ఎక్కువగా పూజించే దేవుళ్ళలో వినాయకుడు ఒకరు. వినాయకుడిని విఘ్న హర్తా అని కూడా అంటారు. విఘ్న హర్త అంటే అడ్డంకులను తొలగించేవాడు అని అర్థం. ఏ శుభకార్యం ప్రారంభించిన ముందుగా గణపతిని పూజిస్తారు. వినాయకుడిని ప్రార్థిస్తే అత్యంత శక్తివంతమైన ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. వినాయకుడిని పూజించడం వలన శ్రేయస్సు, అదృష్టం, జ్ఞానం, అడ్డంకుల తొలగింపు,ఓర్పు,విజ్ఞానం, ఆత్మ శుద్ధి, శాంతియుత జీవితం లభిస్తాయని నానుడి.
కొలువుదీరిన గణనాథులు

Leave a Reply