మట్టి వినాయక విగ్రహాలను వాడుదాం… పర్యావరణాన్ని కాపాడుదాం

* ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల అనారోగ్యానికి గురి అవుతారు

గుంటూరు జిల్లా / పెదకూరపాడు : ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల అనారోగ్యానికి గురవుతారని,సహజరంగులతో తయారుచేసిన మట్టి విగ్రహాలను పూజించాలని  జిల్లా ఉత్తమ సేవా అవార్డు గ్రహీత,జన చైతన్య సమితి కార్యదర్శి తుళ్లూరి సాంబశివరావు అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన పెదకూరపాడులోని జన చైతన్య సమితి స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీనీ సంస్థ ప్రతినిధులు ప్రారంభించారు.ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి పౌరునిపై ఉందన్నారు. 75 తాళ్లూరు మాజీ ఎంపీటీసీ గుత్తికొండ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల ఎన్నో అనర్ధాలు సంభవిస్తాయన్నారు.జన చైతన్య సమితి నిర్వాహకులు షేక్ లియాకత్ అలీ మాట్లాడుతూ మన చెరువులు,జల వనరులకు నష్టం కలిగించే వ్యర్థ పదార్థాల వినియోగాన్ని తగ్గించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఒంటిపులి అంకమ్మరావు,బెజ్జం నాగేశ్వరరావు,బొంత బుజ్జిబాబు, గుత్తికొండ శ్రీపాద వల్లభ రామకోటిరెడ్డి,మాచర్ల జకరయ్య తదితరులు పాల్గొన్నారు.అనంతరం వినాయకుని ప్రతిమలను పంపిణీ చేశారు.

Share this