నంద్యాల : ది నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ నంద్యాల జిల్లా చైర్మన్ గా బండి ఆత్మకూరు మండలం బి కోడూరు గ్రామానికి చెందిన మహబూబ్ బాషను,, నేషనల్ చైర్మన్ డా” సాయి రమేష్ నియమించారు. అనంతరం చైర్మన్ గా ఎన్నుకోబడ్డ మహబూబ్ బాషా మాట్లాడుతూ నా మీద నమ్మకంతో, ప్రజాసేవకు ఎన్నుకొన్న నేషనల్ చైర్మన్ డా” సాయి రమేష్ కు కృతజ్ఞతలు. ఈ రోజు నుండే నా కిచ్చిన ఈ పదవినిబాధ్యతాయతంగా నెరవేరుస్తానని, అంటే వినియోగదారులు ఎక్కడకకూడా నష్టపోకుండా వారికి సూచనలు, సలహాలు ఇస్తూ, ప్రతి ఒక్కరు కొన్న వస్తువులకు బిల్ తీసుకోవాలి.కొంటున్న వాటి నాణ్యత ఎక్సపైర్ డేట్స్ కచ్చితంగా గమనించేలా ప్రోత్సహస్తూ ఒకవేళ నష్టపోతే కన్స్యూమర్ ఫోరమ్ ద్వారా ఏ విదంగా వెళ్ళాలి.ఎలా చేయాలి అన్న విషయాన్ని అందిస్తూ వినియోగదారునికి మార్గదర్శిగా నిలుస్తానని, నా దగ్గరికి వచ్చిన కంప్లైంట్స్ ఏవి వచ్చినా నేషనల్ చైర్మన్ ద్వారా అన్ని పరిష్కరిస్తానని, జాయింట్ కలెక్టర్, ఫుడ్ ఇన్స్పెక్టర్, తూనికల కొలతల అధికారుల ద్వారా నా కిచ్చిన ఈ బాధ్యతను పూర్తిగా నెరవేరుస్తానని తెలియజేశారు.
ది నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ జిల్లా చైర్మన్ గా మహబూబ్ బాషా

Leave a Reply