కోడి గుడ్డు పై 150 మంది స్వాతంత్ర సమర యోధుల సూక్ష్మ చిత్రాలు

నంద్యాల : స్థానిక పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న అవార్డు గ్రహీత చింతలపల్లె కోటేష్ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని వినూత్నంగా ఓకే కోడి గుడ్డు చుట్టూ 150 మంది స్వాతంత్ర సమర యోధుల సూక్ష్మ చిత్రాలను వాటర్ కలర్ తో మైక్రో బ్రష్ ద్వారా 3 గంటల సమయంలో వేసి స్వాతంత్ర సమర యోధులను స్మరించుకుంటూ చిత్రాలు వేసి ఆ మహనీయులకు చిత్ర నివాళులు అర్పిచానని అన్నారు.

ఈ సందర్బంగా కోటేష్ మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న భారతదేశం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొంది స్వతంత్ర దేశంగా అవతరించిది. ఇది మన జాతీయ పండుగ. కుల, మత, జాతి అనే భేదాలు లేకుండా అందరం కలిసి స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. ఎందరో వీరుల త్యాగ ఫలం. నేటి స్వాతంత్ర ఫలం. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులను, సమర యోధులను తలచుకొని మన జాతీయ జెండాను ఎగరవేయాలి. నేను వేసిన ఈ చిత్రం లో భరత మాత ఆశీస్సులు అందజేస్తున్నట్లు, 150 స్వాతంత్ర సమర యోధుల పొట్రాయిట్ సూక్ష్మ చిత్రాలను వేశారు. ఇందులో గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోష్, అల్లూరి సీతా రామరాజు, భగత్ షింగ్, రవీంద్ర నాథ్ ఠాగూర్, రాజా రామ్ మోహన్ రాయ్, చంద్ర శేఖర్ ఆజాద్, బాల గంగాధర్ తిలక్, ఝాన్సీ లక్ష్మీ భాయ్, సరోజినీ నాయుడు, వీర సావర్కర్, తాంతీయ తోపే, సర్వేపల్లి రాధ కృషన్ ఇలా ఎంతో మంది మహనీయుల చిత్రాలతో పాటు ఇంకా వెలుగులోకి రాని సమర యోధుల చిత్రాలను కూడా చిత్రం లో చూపించారు.ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంటుంది.

Share this