నంద్యాల : స్థానిక మార్కెట్ యార్డ్ ఆవరణలో ఆదివారం వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా మంత్రి ఎన్ఎండి ఫరూక్ , మార్క్ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసి రెడ్డి , నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ రైతులకు వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిస్తుందని పేర్కొన్నారు . అనంతరం గోస్పాడు , నంద్యాల రైతులకు విత్తనపు గొర్రు, రోటవేటర్లు తైవాన్ స్ప్రేయర్లు ,బ్యాటరీ స్ప్రేయర్లు కల్టివేటర్లు రైతులకు అందజేశారు. భవిష్యత్తులో రైతులకు రాయితీపై మరిన్ని యంత్ర పరికరాలు అందిస్తామన్నారు. అలాగే జొన్నలకు కొనుగోలు కేంద్రం ని కూడా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, నంద్యాలఏడిఏ రాజశేఖర్ , సివిల్ సప్లై డిఎం రాజు నాయక్, మార్క్ఫెడ్ డిఎం హరినాథ్ రెడ్డి, గోస్పాడు ఏవో స్వప్నికా రెడ్డి , నంద్యాల ఏవో ప్రసాద్ రావు, నంద్యాల గోస్పాడు మండల ఏఈవోలు, అగ్రికల్చర్ , అసిస్టెంట్లు , టిడిపి గోస్పాడు మండల కన్వీనర్ తులసి రెడ్డి , నంద్యాల మండల కన్వీనర్ విశ్వనాథ రెడ్డి , డీసీ చైర్మన్ చాబోలు ఇలియాస్ , నంద్యాల ఎంపీపీ ప్రభాకర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply