నంద్యాల : పేద ప్రజలు ఆపదలో ఉంటే నేనున్నాను అని ఆదుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి మనసుకు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం (రాజ్ టాకీస్) నందు నడిగడ్డకు చెందిన షేక్ యూసుఫ్ భాష మరణించడంతో వారి భార్య షేక్ రేష్మ కు 1,74,958 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేయడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ఎక్కువ ప్రమాదాల వల్ల మరియు అనారోగ్య కారణాల వల్ల వచ్చే వారికి ఆరోగ్యం విషయంలో అజాగ్రత్త వహించకుండా జాగ్రత్తలు వహించాలని ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పేద ప్రజలు ఏదైనా ప్రమాదంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నా, లేదా ఆరోగ్య పరంగా ప్రాణాల మీదకు వచ్చినప్పుడు అత్యవసరంగా ఆపరేషన్లకు కావల్సిన డబ్బులు లేకపోవడం వారి స్థోమతకు మించి ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు నాకు విన్నవించుకున్న సందర్భంలో వారి ఆవేదన విని, అప్పటికప్పుడు దగ్గరుండి సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేయించారన్నారు. అలా పేదవారి ఆపరేషన్ల ఖర్చుకు సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి షేక్ రేష్మ కు 1,74,958 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మంత్రి ఎన్ఎండి ఫరూక్ క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ను అందజేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్

Leave a Reply