నంద్యాల : స్థానిక టీడీపీ కార్యాలయం (రాజ్ టాకీస్) నందు చిరంజీవి పుట్టినరోజు వేడుకల పోస్టర్ ను మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆవిష్కరించారు. చిరంజీవి రామ్ చరణ్ యువత జిల్లా అధ్యక్షులు, జనసేన నాయకులు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పబ్బతి రవి ఆధ్వర్యంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ పోస్టర్ ను ఆవిష్కరించారు. వచ్చే నెలలో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నంద్యాలలో వారం రోజులపాటు చేయబోయే సేవా కార్యక్రమాల గురించి మంత్రి ఫరూక్ కు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పబ్బతి రవి వివరించారు.ఈ సేవా కార్యక్రమాలలో తాను కూడా పాల్గొంటానని మంత్రి ఫరూక్ తెలిపారు. సేవా కార్యక్రమాలలో పాల్గొనే ప్రతి ఒక్కరిని మంత్రి ఫరూక్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు, జనసేన నాయకులు సాయి జయంత్, వెంకటేష్, నాగార్జున, సురేష్, బ్లడ్ అచ్చు, సలీం, విశ్వనాధ్ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply