పల్లంపర్తి, ముక్కిడి పాలెం పంచాయతీల్లో ఎమ్మెల్యే ఇంటింటికి ప్రచారం

చిట్టమూరు : చిట్టమూరు మండల పరిధిలోని పల్లంపర్తి, ముక్కిడి పాలెం పంచాయతీల్లో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వము నుండి అందుతున్న సంక్షేమ పథకాలు గురించి వివరించి, ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటున్న గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని, ముక్కిడి పాలెం పంచాయితీలో ముఖ్యమంత్రి సహాయనిది నుండి నాలుగు చెక్కులను ఇవ్వడం జరిగిందని, అలాగే వైద్యం తెలుసుకోలేని పేద ప్రజలు ఎవరైనా ఉంటే పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే కార్యాలయంను సంప్రదించి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పొందవచ్చని తెలిపారు, ఏ ఇంటికెళ్లిన ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఉచిత సిలిండర్లు, తల్లికి వందనం, అందిన ఆనందాన్ని వ్యక్తపరిచారని ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఘనపర్తి కిషోర్ నాయుడు, సునీల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Share this