నంద్యాల జిల్లా / డోన్ : స్థానిక పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బేతంచెర్ల మండలంలోని ఆర్.ఎస్. రంగాపురం గ్రామ శివారులో వెలిసిన ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రం శ్రీ ఘన మద్దిలేటి స్వామి దేవస్థానంలో నిర్వహించనున్న ముక్కోటి ఏకాదశి మహోత్సవాల సందర్భంగా డోన్ శాసనసభ్యులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ని దేవస్థానం ఈఓ శ్రీ రామాంజనేయులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ ఘన మద్దిలేటి స్వామి దేవస్థానం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోందని, ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించాలన్నారు. దేవస్థానం అభివృద్ధికి ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది, ఆలయ ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


































Leave a Reply
View Comments