కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ఆగ్రహం

నంద్యాల : స్థానిక పట్టణంలోని ఎమ్మెల్సీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ నెల్లూరులో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని కలవడానికే వీల్లేకుండా వైసీపీ నాయకులను, కార్యకర్తలను, ప్రజలను కూటమి ప్రభుత్వం అడ్డుకోవడంపై ఎమ్మెల్సీ ఇసాక్ బాషా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కూటమి ప్రభుత్వం జగన్‌పై కక్ష సాధింపు చర్య అని ఆయన మండిపడ్డారు.జన నేత వై.ఎస్. జగన్ ని కలవకుండా ఎక్కడా లేని విధంగా ప్రజలపై ఆంక్షలు విధించడం కూటమి ప్రభుత్వానికే చెల్లిందని ఇసాక్ బాషా అన్నారు. ప్రజలు తమ అభిమాన నాయకుడిని కలవకుండా అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Share this