* ఆంధ్రప్రదేశ్ లోని అన్ని అభయారణ్యాల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి.
డిల్లీ : మూగ జీవుల రక్షణ కోసం పార్లమెంట్ లో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి గళమెత్తారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని అభయారణ్యాలకు, నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్న రోళ్లపాడు అభయారణ్యం రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని పార్లమెంట్ లో నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు.
సోమవారం పార్లమెంట్ జీరో అవర్ లో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆంధ్రప్రదేశ్ లోని అభయారణ్యాల రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని, అందుకు అవసరమైన నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయాలని కోరారు.
నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం లోని నందికొట్కూరు అసెంబ్లీ పరిధిలో ఉన్న రోళ్లపాడు అభయారణ్యం రక్షణ కోసం కూడా తక్షణ చర్యలు తీసుకోవాలని లోక్ సభలో మూగ జీవుల కోసం గళమెత్తారు. రోళ్లపాడును Integrated Development of Wildlife Habitat Scheme లో ప్రాధాన్య ప్రాజెక్ట్ గా చేర్చి, బ్రీడింగ్ & కన్సర్వేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ లోనీ అన్ని అభయారణ్యాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని లోక్ సభలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రూ. 243 కోట్లు విడుదల చేసినా, గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సున్నా నిధులు మాత్రమే వచ్చిందనీ, ఈ తప్పిదాన్ని కేంద్రం సరిచేసి అవసరమైన నిధులు అభయారణ్యాల రక్షణకు మంజూరు చేయాలని కోరారు.
Leave a Reply